September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆరోగ్య చిట్కాలు…

1 min read

AABNEWS : ఆయుర్వేదం లో ఆరోగ్యాన్ని సూచించే 6 సూత్రాలు పాటిస్తే చాలు ఆరోగ్యం మీ సొంతం

1. బెడ్ మీదే ఉండి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టే బదులు ఓ పది నిమిషాలు ఎండ పడే ప్రాంతానికి వచ్చి అక్కడ ఛాటింగ్ చేయండి.. సూర్య కిరణాలు మీ మేనుని తాకి కావలసిన డి-విటమిన్ అందిస్తుంది. శరీరం కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆ సమయంలో పడే సూర్య కిరణాలు మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే బ్రష్‌కి ముందే ఓ గ్లాస్ వేడినీళ్లు తాగితే శరీరంలో పేరుకున్న మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇది తప్పనిసరిగా మీ దినచర్యలో భాగం చేస్తే సగం ఆరోగ్య సమస్యలు తీరినట్లే.

2. సాయింత్రం వీచే చల్లని గాలిలో కొంత సమయం గడపాలి. చల్లని గాలి స్పర్శ శరీరానికి టానిక్‌లా పనిచేస్తుంది. ఓ గంట వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో మలినాలు చేరకుండా ఉంటాయి. అస్వస్థతకు గురైన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందు నుంచి మంచి అలవాట్లు పెంచుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా నివారించొచ్చు.

3.సమయానికి ఆహారం తినకపోగా, ఎప్పుడు పడితే అప్పుడు తినడం సరికాదు.. శీతల పానీయాలు, కాఫీ, టీలు మితిమీరి తాగకూడదు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు చేయవు.

4.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ఓ చక్కని చికిత్స. లంకణం పరమౌషధం అని ఆయుర్వేదం చెబుతోంది. జీర్ణవ్యవస్థకు అప్పుడప్పుడూ విశ్రాంతి ఇవ్వాలి. తరచూ ద్రవపదార్థాలు, పండ్లను తీసుకుంటూ ఉపవాసాన్ని ఆచరించాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న మలినాలు తొలిగిపోతాయి. నీరు కూడా తగినంత తీసుకోవాలి. మంచిది కదా అని మించి తీసుకుంటే దాని వల్ల చెడే ఎక్కువగా జరుగుతుందని డాక్టర్లు అంటారు.

5.తీసుకునే ఆహారం మితంగా ఉండాలి. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేంత వరకు మళ్లీ తినకుండా ఉండడం ఉత్తమం.

6.అనారోగ్య హేతువులైన మద్యపానం, కూల్ డ్రింకులు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవనశైలి మనిషిని రోగాల బారిన పడేస్తుంది. షుగర్, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌లు, నిద్రలేమి ఇలా ఒకటేమిటి ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

 305 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.