November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉలవలు కిడ్నీలను బాగుపరుస్తాయి…

1 min read

AABNEWS : నవ ధాన్యాల్లో ఒకటైన ఈ ఉలవలు.. ఆరోగ్యానికి చేపే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటారు. ఉలవలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీవ్యాధులతో బాధపడేవారికి ఉలవలు బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఉలవలను, కొంత బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. ఉల్లవల్లో ఉండే కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది. దగ్గు, ఉబ్బసంతో బాధపడుతున్నవారు ఉలవల కషాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉలవల్లో పాస్ఫరస్‌, ఫైబర్, ఐరన్‌, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. శరీరంలో రోగాలతో పోరాడే ఇమ్యూనిటీ పవర్‌ను సైతం పెంచుతుంది. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఇవి మంచి ఆహరం.

 1,347 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.