జీలకర్రతో కొవ్వు తగ్గించుకోవడం ఎలా…
1 min read
AABNEWS : మనకు తెలిసి జీరా ఆహారానికి రుచిని పెంచడమే కాక.. సుగంధ పరిమాళాన్ని అందించే మసాలా. కానీ తెలియని.. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. జీలకర్ర బరువును తగ్గించడంతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందట. ఇక జీలకర్రతో కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక.. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందట. జీలకర్ర మీ జీర్ణవ్యవస్థకు సహాయపడి.. పేగులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమయ్యే ఇనుమును దీని ద్వారా తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ జీరాలో 1.4 మి.గ్రా ఇనుము కలిగి ఉంటుంది. ఇది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర కొవ్వు కరిగించి, బరువు తగ్గేలా చేస్తుంది. చివరగా, జీలకర్ర శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.బరువు తగ్గాలనుకునే వారికి జీలకర్ర బాగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ జీలకర్ర తినడం, దాని జ్యూస్ తాగడం వల్ల బొడ్డు చుట్టూరా ఉన్న కొవ్వుతో పాటు మీ శరీరంలోని ఇతర భాగాల్లో పెరుగుతున్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనంలో భాగంగా.. ఊబకాయంతో బాధపడుతున్న 80 మంది మహిళలను రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ఒక గ్రూపువారు జీలకర్రను ఉపయోగించగా.. మరో బృందం మాత్రం ఇతర ‘డైట్ కంట్రోల్’ పాటించారు. చివరకు డైట్ కంట్రోల్ పాటించిన వారితో పోల్చితే.. జీరా తిన్నవారు అత్యధికంగా బరువు తగ్గినట్లు తేలింది. దీన్నిబట్టి.. జీలకర్ర తినడం లేదా తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడమే కాక.. కేలరీలను వేగంగా బర్న్ చేయచ్చని తెలిసింది. కింద తెలిపిన విధంగా జీలకర్రను ఉపయోగిస్తే బరువు తగ్గడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో మీరూ చూసి ట్రై చేయండి.రాత్రిపూట జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే అదే నీటిలో మరిగించాలి. తర్వాత ఈ పానీయాన్ని వడకట్టి తాగాలి. మీకు మరింత రుచికరంగా అనిపించాలంటే.. మీరు నిమ్మకాయ రసాన్ని జోడించుకోవచ్చు. ఇలా 2 వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగి చూడండి.. ఖచ్చితంగా ఫలితం మీకే తెలుస్తుంది.ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలపండి. దీన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినండి. ఇలా 15 రోజులు పాటు చేస్తే మీరు బరువు తగ్గడం ఖాయం.
169 Total Views, 2 Views Today