September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం…

1 min read

AABNEWS : యోగా వలన సంపూర్ణ ఆరోగ్యంతో పాటు,మానసిక సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చని ది యోగా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హన్సా జె. యోగేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యోగా ఇనిస్టిట్యూట్ 102 సంవత్సరాలు పూర్తిచేసుకోవడంతో యోగా ప్రాధాన్యత అనే అంశంపై వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ మంత్రి నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన మంచి ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీన వ్యవస్థను పటిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే కోవిడ్ చికిత్సా విధానంతో పాటు, వ్యాధి రాకుండా తీసుకోవాలిస్సన జాగ్రత్తలలో యోగా కూడా నిత్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యోగా ఇనిస్టిట్యూట్ 102వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మెడిటేషన్ యాప్, నిస్ఫాంద సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి నాయక్ సంస్థ సభ్యులను అభినందించడంతో పాటు భవిష్యత్తు తరాల వారికి ఉపయోగడపవే విధంగా పరిశోధనలు కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా సంస్థ సభ్యులను అభినందించారు. ప్రస్తుత కోవిడ్ పాండమిక్ లో యోగా సేవలను విస్తరించేందుకు కృషి చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగానే వివిధ సంస్థలతోత కలిసి యోగ సేవలను అందించినట్లు తెలిపారు. రానున్న కాలంలో కూడా యోగా సేవలను విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలియచేశారు.

 471 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.