AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లవంగాలు తింటే ఇన్ని లాభాలా…

1 min read

AABNEWS : హైదరాబాద్‌: లవంగాన్ని దేవకుసుమ అనికూడా అంటారు. ఇది ఒక సుగంధ ద్రవ్యం. ప్రతిఇంట్లో పోపులపెట్టెలో ఉండే మసాలా దినుసు. వీటిని రుచికోసం కూరల్లో వాడుతారు. ఇవి మంచి వాసనేకాదు.. మనకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఇందులో ఐరన్‌ అధికంగా ఉంటుంది. అలాగే, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మాంగనీస్‌, విటమిన్ ఏ,సీ ఉంటాయి. వీటిని వంటల్లోనేకాదు కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు. వీటిని క్రమంతప్పకుండా వాడితే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వికారంలాంటివి పోతాయి. జలుబు, దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో ఓ లవంగం వేసుకుని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. లవంగాలను రోజూ తింటే విషపదార్థాల్ని బయటకు పోతాయి. తలనొప్పి అధికంగా ఉంటే రోజూ రెండు లవంగాలు తినాలి. బీపీని కంట్రోల్‌ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని ఇవి తగ్గిస్తుంది. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి. లవంగాలను రెగ్యులర్‌గా తింటే కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి, ఇవి బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. ఇందులో మాంగనీసు పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి.

 55 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.