AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

2020 మరిచిపోలేని స్సంవత్సరం…

1 min read

AABNEWS : 2020 సంవత్సరం కొన్ని తరాల వరకు గుర్తుండి పోతుంది. ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతోంది. ఎందుకంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంవత్సరం. ప్రతి ఒక్కరిని ఇంటికి పరిమితం చేసిన ఏడాది. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్‌ను ఛేంజ్ చేసిన సంవత్సరం. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రతి మనిషి జీవన స్థితిగతుల్లో మార్పులు సంభవించాయి. ఆ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వంటింటి చిట్కాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కషాయం, గ్రీన్ టీ, వేడి నీళ్లు, మాస్కులు, శానిటైజర్లు.. ఈ మూడు ప్రతి ఇంటిలో భాగమయ్యాయి. కరోనాను ముందే నివారించేందుకు ఈ మూడు చిట్కాలను విరివిగా ఉపయోగించారు. దాంతో సుగంధ ద్రవ్యాలకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. మన ఇంటి పరిసరాల్లో పెరిగే రకరకాల మొక్కలు, వన మూలికలు, ఇంట్లో వంట కోసం వాడే పదార్థాలతోనే ఈ స్పెషల్‌ టీ తయారు చేసుకుని కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఏ మనిషయినా సరే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కావాల్సింది రోగ నిరోధక శక్తి . ఆ శక్తి తగ్గినప్పుడు మనిషిని నీరసం ఆవహిస్తుంది. అప్పుడు రోగకారక బ్యాక్టీరియా/వైరస్‌ ఆ మనిషిపై వెంటనే దాడి చేస్తుంది. తనకు ఎదురులేనప్పుడు విజృంభిస్తుంది. చంపేస్తుంది. తనను ధీటుగా ఎదుర్కొనే శక్తి ఆ మనిషిలో ఉన్నప్పుడు కరోనా మాత్రమే కాదు.. ఏ వైరస్ అయినా చచ్చి తీరుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, కరోనాను పారదోలాలంటే.. అర్జెంటుగా చేయాల్సిన పని.. ఇమ్యూనిటీని పెంచుకోవడం. రోగ నిరోధక శక్తిని పెంచే గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, జింజర్‌ టీలతోపాటు ఆయుర్వేద టీలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ టీ తాగేవారు రోజు రోజుకు పెరిగిపోయారు. దాల్చిన చెక్క, మిరియాల పొడి, పసుపు, తులసి ఆకు, నిమ్మకాయ కలిపిన ఆయుర్వేద టీకి డిమాండ్ పెరిగింది. ఈ రకమైన కషాయాలు తాగడంతో.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. రకరకాల ఆయుర్వేద మిశ్రమాలతో కూడిన టీలు ప్రతి ఇంటిలో భాగమయ్యాయి. ఇక ప్రతి అరగంటకోసారి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అంతే కాదు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి గంటకోసారి చేతులను సబ్బుతో కడుక్కుంటూ వైరస్‌ను నివారించేందుకు యత్నించారు.

ఇక మాస్కులు, శానిటైజర్లు ప్రతి ఇంట పరిచయం అయ్యాయి. ముఖానికి మాస్కు ధరించని మనిషి లేనే లేడు. మాస్కు అంటే తెలియని సామాన్యుడు కూడా.. వైరస్‌ను ఎదుర్కొనేందుకు మాస్కు ధరించారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొంటే వృద్ధుల వరకు మాస్కు ధరించి కరోనా నుంచి బయట పడేందుకు చర్యలు తీసుకున్నారు. కొందరు మాస్కులను ఇంట్లోనే తయారు చేసుకున్నారు. మరికొందరు మార్కెట్లో దొరికే మాస్కులను ఉపయోగించారు. ఈ మాస్కు వినియోగంతో కరోనాను కట్టడి చేయడమే కాదు.. కాలుష్య కోరల నుంచి కూడా తప్పించుకున్నారు.

 446 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.