AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన బండారు గూడెం పోలింగ్…

1 min read

AABNEWS : బాపులపాడు మండలం లోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన బండారు గూడెం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కృష్ణాజిల్లా: నాల్గవ విడత జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నూజివీడు డివిజన్ లోని సమస్యాత్మక గ్రామమైన బండారుగూడెం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ముందుగా సందర్శించారు. అక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. వృద్ధులు, వికలాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి పోలీసులు చేయూతనివ్వాలని తెలిపారు. గొడవలు, అల్లర్లు ఉత్పన్నమవుతాయి అనే సందర్భాలను ముందుగానే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో పోలీసు సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు.

 648 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.