AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎస్ఐ ఆత్మహత్య …

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన అపార్ట్మెంట్ లో విజయ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విజయ్ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమంటూ సహచర సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన విజయ్ కుమార్, 2012 బ్యాచ్ యసై గా, హనుమాన్ జంక్షన్లో తొలి బాధ్యతలు చేపట్టాడు. నూజివీడు కు చెందిన బ్యూటీషియన్ తో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన విజయ్ కుమార్ గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోనీ పలు పోలీస్ స్టేషన్ల లో ఎస్సై గా బాధ్యతలు నిర్వహించారు. ఏలూరు చెందిన మహిళతో మూడు నెలల క్రితం విజయ్ కుమార్ కు వివాహం కాగా, భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్ తో కలిసి ఆయన ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. బ్యూటిషన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్ భౌతికకాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ కుమార్ మరణవార్త తెలుసుకున్న సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, ఏరియా ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు

 192 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.