ధర్మ పరిరక్షణ యాత్ర
1 min read
AABNEWS : కృష్ణా జిల్లా (గన్నవరం) గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన “ధర్మ పరిరక్షణ యాత్ర” కార్యక్రమ వివరాలు… ధర్మ పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం ధర్మపరిరక్షణ యాత్ర బైక్ ర్యాలీలో దొంతు చిన్నా రాష్ట్రంలో ధర్మాన్ని పరిరక్షించడంతో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా విమర్శించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై లౌకికవాదులు, భక్తులు అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీ గౌతం సవాంగ్ పలాయనం చిత్తగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగు యువత గన్నవరం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్మపరిరక్షణ యాత్ర బైక్ ర్యాలీ శుక్రవారం జరిగిది. ఈ ర్యాలీని పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుతో కలసి చిన్నా ప్రారంభించారు. గన్నవరంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ జాతీయ రహదారి మీదగా గాంధీ బొమ్మ సెంటర్. పాత గన్నవరం, మర్లపాలెం, బస్టాండ్, శ్రీనగర్ కాలనీ మీదగా తిరిగి పార్టీ కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి హిందూ దేవుళ్లపై ప్రకటనలు, వీడియోలు విడుదులవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 156 ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇతర పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తేగానీ కంటితుపుడుగా పాస్టర్ ప్రవీణ్ పై కేసు పెట్టారని వ్యాఖ్యానించారు. మతోన్మాదాన్ని, ద్వేషాన్ని రెచ్చగొట్టేవారిపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులపై పోలీసుల వేధింపులు, అక్రమ అరెస్టులను తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జూపల్లి సురేష్ బొడ్డపాటి రాంబాబు, తెలుగు యువత సీనియర్ నాయకుడు మండవ అన్వేష్ గన్నవరం మండల అధ్యక్షుడు చీమలదండు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు బడుగు కార్తీక్, కార్యదర్శి గుర్రం గోపీనాద్, కార్యనిర్వాహక కార్యదర్శి పలగాని కల్యాణ చక్రవర్తి, యువత నాయకులు ఫణి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
43 Total Views, 2 Views Today