AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బకాయి జీతం చెల్లించాలని వృద్ధురాలు నిరసన…

1 min read

AABNEWS :

బకాయి జీతం చెల్లించాలని వృద్ధురాలు నిరసన. (నూజివీడు,): చేసిన పనికి జీతం ఇవ్వాలని ఓ వృద్ధ మహిళ పాఠశాల ఎదుట నిర సన దీక్ష చేపట్టిన వైనం. కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామం లో
26నెలల జీతం ఇవ్వకుండా అక్రమంగా స్వీపర్ పోస్ట్ నుండి తనను తొలగించారని ఇస్సంపల్లి మంగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఈ మేరకు చనుబండ లోని మెయిన్ ప్రాథమిక పాఠశాల ఎదుట శనివారం సాయంత్రం వరకు ఎర్రని ఎండలో నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా మంగమ్మ మాట్లాడుతూ తనకు ప్రభుత్వం ఇవ్వాల్సిన జీతం ఇచ్చేవరకు నైనా పాఠశాల ఊడ్చి, మరుగుదొడ్లు శుభ్రం చేయనీయమని వేడుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2015 నుండి పాఠశాలలోని మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ న్నానని, నెలకు రెండు వేల రూపాయల జీతానికి సంవత్సరానికి 10నెలలచొప్పున 50నెలలు పనిచేస్తే,24నెలల జీతం మాత్రమే ఇచ్చారని, ఇంకా ప్రభుత్వం నుంచి 26నెలలకు రూ 52వేలు జీతం రావాల్సి ఉందన్నారు. తనకు రావలసిన జీతం నగదు ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదని టీచర్లు, నన్ను అక్రమంగా తొలగించిన పేరెంట్స్ కమిటీ సభ్యులు అంటున్నారని మంగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల సంఘం జిల్లా కమిషనరేట్ నుండి విడుదలైన సర్క్యులర్ లో 50 సంవత్సరాల పైబడిన వారిని పేరెంట్స్ కమిటీ అనుమతితో కొనసాగించ వచ్చుననే నిబంధన ఉన్నప్పటికీ రాజకీయ దురుద్దేశంతో పేరెంట్స్ కమిటీ ని అడ్డుపెట్టుకొని ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్న తనను అక్రమంగా తొలగించారని మంగమ్మ వాపోతోంది.

 173 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.