AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బస్సులో ప్రయాణికుని వద్ద కోటి పది లక్షల…

1 min read

AABNEWS : గరికపాడు చెక్ పోస్టు వద్ద బస్సులో ప్రయాణికుని వద్ద కోటి పది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న చిల్లకల్లు పోలీసులు గరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద ఒక్క కోటి పది లక్షల నగదు లభ్యం అయ్యాయని చిల్లకల్లు యస్.ఐ వి వెంకటేశ్వర్లు తెలియజేసారు.కోటి పది లక్షల రూపాయల నగదు నందిగామ డియస్పి నాగేశ్వరరెడ్డి,సిఐ చంద్రశేఖర్ ఎటువంటి పత్రాలు లేని నగదును స్వాధీనం చేసుకొన్నారు.ఎన్నికల కోసమా,హవాలా డబ్బులా అరా తీస్తున్న ఖాకీలు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న రాయల సత్యనారాయణ నుండి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా కోటి పది లక్షల రూపాయల నగదు పట్టుబడినట్లుగా సమాచారాని పోలీస్ వారు తెలియజేసారు.రాయల సత్యనారాయణ మాట్లాడుతూ తను రైతునని నాగర్ కర్నూల్ లో ఉన్న 16 ఎకరాల 20 కుంటల సాగు భూమిని అవసరం కోసం అమ్ముకొని,నూజివీడు దగ్గర గల ఎనమకుదురు సింకోలుకి వెళ్ళుతున్నాని రైతు ఆవేదన వ్యక్తం చేసారు.నందిగామ డియస్పి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కోడు కారణంగా ఇంత మెుత్తం డబ్బులు తరలించడంతో డబ్బులను సీజ్ చేసి ప్రభుత్వ ఖజానాకి హ్యాండవర్ చేస్తామని,సరైన ఆధారాలను చూపించి డబ్బులను ప్రభుత్వం నుండి తీసుకోవలసి ఉంటుందని,లేని యెడల ప్రభుత్వం పూర్తిగా హ్యాండవర్ చేసుకుంటుందని ఆయన అన్నారు.

 226 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.