AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా…

1 min read

AABNEWS : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర బందును జయప్రదం చేయాలి.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక హనుమాన్ జంక్షన్ శాఖ పిలుపు.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీన జరిగే రాష్ట్ర బందును విజయవంతం చేయడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక హనుమాన్ జంక్షన్ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన మండల సిపిఎం కార్యదర్శి బేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ లేదు, మెట్రో రైల్ లేదు, వాల్తేరు డివిజన్ ఎత్తివేశారు, రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రంలో బీజేపీ చూస్తుంది అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ తో పాటు ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామన్నారు. సభలో పాల్గొన్న రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం లోని కొంత మంది పెద్దలు కుమ్మక్కయి మూడు లక్షల కోట్ల రూపాయల విలువ గల స్టీల్ ప్లాంట్ ను 20 వేల ఎకరాల భూమిని ప్రైవేటీకరణ పేరుతో దోచుకోవాలని చూస్తే సహించేది లేదని స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ప్రేమ ఉంటే సొంత కేటాయించి స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న జరిగే బంద్ లో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ సంఘం ఉపాధ్యక్షులు కల్లం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ ప్రభుత్వం సర్వం ప్రైవేటీకరణ అనే నినాదంతో పయనిస్తుందని రాష్ట్రంలోని అతి పెద్ద పరిశ్రమ అయిన స్టీల్ ప్లాంట్ లో 32 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారని ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నుల రూపంలో 44 వేల కోట్ల రూపాయలు చెల్లించి ఉందని దేశంలోనే సముద్రతీరంలో ఉన్న ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు మణిహారం. ప్రాణాలర్పించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. హనుమాన్ షుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమా వరప్రసాద్ 54 సంవత్సరాల క్రితం ఎస్.ఆర్.ఆర్ కాలేజీ స్టూడెంట్ గా స్టీల్ ప్లాంట్ సాధన కోసం పోరాడతానని మళ్లీ ఇప్పుడు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడ వలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని 32 మంది త్యాగధనులు ప్రాణాలర్పించి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల రక్త తర్పణం అని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి అని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో లో మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, దేశ నాయకులు చిన్నబోయిన శివయ్య, సిఐటియు నాయకులు కే ఏసు పాదం, నల్లి ఆంజనేయులు, సిపిఎం నాయకులు అబ్దుల్ భారీ, తోట సాంబశివరావు తదితరులు ప్రసంగించారు.ఈనెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి హనుమాన్ జంక్షన్ లో రాష్ట్ర బంద్ నిర్వహించాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు కేంద్రం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు రాజీలేని పోరాటం చేస్తున్న రైతుల ఉద్యమం ఈనెల 6వ తేదీకి 100 వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో 6 తేదీన ఉదయం రైతుల ఉద్యమానికి మద్దతుగా టైర్ బండ్లతో ప్రదర్శన, 6 తేదీ సాయంత్రం 100 కొవ్వొత్తులతో కిసాన్ జ్యోతి సంయుక్త కిసాన్ మోర్చా జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు

 770 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.