
AABNEWS : నందిగామ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నట్లు దానికి సంబంధించిన అన్ని రకాల చర్యలను తీసుకున్నట్లు ఆసరా జాయింట్ కలెక్టర్ కే. మోహన్ కుమార్ తెలిపారు.
మార్చి 10న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగునని అనంతరం వార్డుల వారీగాలెక్కింపుకార్యక్రమం నిర్వహించడంజరుగుతుంది అని తెలిపారు. ఎన్నికల లెక్కింపు సంబంధించి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు లెక్కింపుభవనాన్ని మున్సిపల్ కమిషనర్ జై రామ్ తో కలిసి పరిశీలించారు. లెక్కింపు జరుగుతున్న తరుణంలో బయటవారినిలోనికి అనుమతించబడదు అని కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ పక్రియ లో పాల్గొనే అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమనిబంధనలుతప్పక పాటించాలని. ఎవరైనా ఎన్నికల లెక్కింపు కార్యక్రమానికి ఆటంకాలు కలిగితే వారిపైఎన్నికల చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని జేసీ మెహనకూమార్ తెలిపారు.
1,646 Total Views, 32 Views Today