అర్జున్ బౌలింగ్‌లో ఉతికిఆరేసాడు…
1 min read
AABNEWS : ముంబై: ఇటీవల ముగిసిన ఐపీఎల్-2020 సీజన్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించిన ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. త్వరలో ఆరంభంకానున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్నాడు. కొన్నేండ్లుగా నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భారత జాతీయ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా టీమ్-డీతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్-బీకి సారథ్యం వహిస్తున్న సూర్య కుమార్ కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ డీ-టీమ్‌కు ఆడుతుండగా యశస్వి జైశ్వాల్ ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అర్జున్ వేసిన 13 ఓవర్లో సూర్య కుమార్ రెచ్చిపోయి ఆడి 21 పరుగులు రాబట్టాడు. తన తొలి రెండు ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లెఫ్మార్మ్ పేసర్ అర్జున్.. యాదవ్ బౌలింగ్‌లో తేలిపోయాడు.
87 Total Views, 2 Views Today