AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆసీస్ ముందు భారీ లక్ష్యం…

1 min read

AAB NEWS : కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఆల్‌రౌండర్లు హార్థిక్ పాండ్యా (92; 76బంతుల్లో 7పోర్లు 1సిక్స్‌), రవీంద్ర జడేజా ( 66; 50 బంతుల్లో 5 పోర్లు, 3సిక్సర్లు) ఆదుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీస్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. 16 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అబాట్ బౌలింగ్‌లో పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన కోహ్లీ ( 63; 78 బంతుల్లో 5పోర్లు) మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌( 33; 39 బంతుల్లో 3పోర్లు, 1సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిదద్దాడు. తొలుత వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన జోడి.. కుదురుకున్న తరువాత స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించింది. అయితే.. గిల్‌ను అగర్ ఔట్ చేయడంతో 56 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ (19), ఐదులో వచ్చిన (5) లే వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో కోహ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే బాద్యతను భుజాలపై వేసుకున్నాడు. అడపాదడపా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 62 బంతుల్లో అర్థశతకం సాధించాడు.

కోహ్లీని హెజిల్‌వుడ్ ఔట్ చేయడంతో.. 152 పరుగులకే భారత్ ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఆల్‌రౌండర్లు హార్థిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

తొలుత పాండ్య బౌండరీలతో హోరెత్తించగా.. చివర్లో జడేజా విశ్వరూపం చూపించాడు. ఆసీస్‌పై ఆరో వికెట్‌కు అభేద్యంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో.. భారత్ మూడు వందల పరుగలు దాటింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అగర్ రెండు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్, అబాట్‌, జంపా తలా ఓ వికెట్ చొప్పున పడగొట్టారు.

 38 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.