చివరిసారిగా శ్రీలంకపై ఇలాంటి గెలుపు…
1 min read
AABNEWS : మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. మెుదటి టెస్ట్‌లో ఓడించిన ఆస్ట్రేలియా జట్టుపై ఈ గెలుపుతో ప్రతికారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ గెలుపు భారత జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 10 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై తొలుత ఫీల్డింగ్ చేసిన టెస్టు మ్యాచ్‌లో గెలుపొందింది. చివరి సారిగా 2010లో శ్రీలంకతో ప్రేమదాస స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ మెుదట ఫీల్డింగ్ చేసిన మ్యాచ్‌లో విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్ళీ ఆసీస్‌పై ఈ తరహా విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఆసీస్ కూడా ఓ చెత్త రికార్డును మూట గట్టుకుంది. టాస్ గెలిచిన తర్వాత ఒక స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడిపోవడం 9 ఏళ్ల తర్వాత ఇప్పుడే జరిగిందే. 2011-12 సీజన్లో న్యూజిలాండ్‌పై ఇలానే ఆసీస్ ఓడింది. బాక్సింగ్‌డే టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. విజయగర్వంతో విర్రవీగుతున్న ఆసీస్‌ను నేలకు దించింది. మెుదటి టెస్ట్‌లో ఎదురైన పరాజయానికి చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలుపొదింది ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. కెప్టెన్ అజింక్య రహానె(27), ఓపెనర్ శుభ్‌మన్ గిల్(35) పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.ఇక ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-1 తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిపించిన క్రెడిట్ రహానేకు దక్కింది. విశేషంగా రాణించినందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. తొలి ఇన్నింగ్‌లో రహానే మాస్టర్ బ్యాటింగ్‌తో 112 పరుగులు చేసి టీమిండియా 300 పైగా స్కోర్ చేయడానికి సహకరించారు. సారథిగా కూడా జట్టును ముందుండి నడిపించారు. చివరకు అతని కృషి ఫలితంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే జానీ ములాగ్ మెడల్‌ను కూడా రహానే గెలుచుకున్నాడు. ఈ అరుదైన మెడల్ గెలుచుకున్న క్రికెటర్‌గా రహానే చరిత్రలో నిలిచాడు.
97 Total Views, 2 Views Today