AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ధోనీ స్థానం భర్తీ చేయడం కష్టం…

1 min read

AAB NEWS : ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అయితే అతడి పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. తన అవగాహన మేరకు మైదానంలో స్పిన్నర్లకు సలహాలు ఇస్తానని వెల్లడించాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహులే కీపింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఒక వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఉండాలో అతడు మనందరికీ చూపించాడు. అతడి నుంచే మనమెంతో నేర్చుకున్నాం. కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజాతో నాకు మంచి అవగాహన ఉంది. ఏది మంచి లెంగ్తో, ఎక్కడ బంతులు వేయాలో, ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలో నా సామర్థ్యం మేరకు వాళ్లకు సూచనలు చేస్తుంటాను. గ్లోవ్స్‌ ధరించిన ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంటుంది’ అని రాహుల్‌ అన్నాడు. టీమ్‌ఇండియా తరఫున వికెట్‌ కీపింగ్‌ను తాను ఆస్వాదిస్తున్నానని రాహుల్‌ తెలిపాడు. గతంలో న్యూజిలాండ్‌లో గ్లోవ్స్‌ ధరించానన్నాడు. సారథి, బౌలర్లకు తన అభిప్రాయాలు చెప్పానన్నాడు. ‘కివీస్‌ పర్యటనలో నేను గ్లోవ్స్‌ ధరించాను. కీపింగ్‌ను ఆస్వాదించాను. వికెట్ల వెనకాల ఉంటూ మ్యాచ్‌ను అర్థం చేసుకొని కోహ్లీ, బౌలర్లకు సలహాలు ఇచ్చాను’ అని వివరించాడు.

 20 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.