బీసీసీఐ కీలక నిర్ణయం…
1 min read
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. తాజా నిర్ణయం ప్రకారం మ్యాచ్‌లను కుదించారు. ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జిరుగుతాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మీడియాకు వెల్లడించాడు.
టెస్ట్ మ్యాచ్‌లను కుదించి వాటి స్థానంలో టీ20 మ్యాచ్‌లను పెంచారు. దీనికి కారణం లేకపోలేదు. వర్డల్ కప్ 2021కి ఇండియా అతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితిల్లో సురక్షితమైన ప్రోటోకాల్ పాటిస్తూ మ్యాచ్ నిర్వహిస్తామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుని టోర్నీ నిర్వహణ జరుగుతుందని గంగూలీ తెలిపాడు.
కరోనా వైరస్ లాంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఐపీఎల్‌ను ముగించామంటూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐపీఎల్-2020ను విజయవంతంగా ముగించడం గర్వంగా ఉందన్నారు. ఇనాళ్ళు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న గంగూలీ.. ఇప్పుడు ప్రతిష్టాత్మికమైన ఆస్ట్రేలియా పర్యటనపై దృష్టి సాధించారు. మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన దాదా… తను గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు పరీక్షలు చేయించుకున్నానన్నారు. కరోనా ఉధృతి కారణంగా అన్ని సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది అన్నారు. ప్రస్తుతం మా కుటుంబంలో పెద్దవాళ్లైన తల్లిదండ్రులు ఉన్నారు. అందువల్ల చాలా కేర్ తీసుకోవాల్సివచ్చిందన్నారు. మొదట్లో చాలా భయపడ్డా. ఆ తర్వాత మెల్గమెల్లగా పరిస్థితులు చక్కబడ్డాయి. మనం తప్పలు వల్ల చుట్టూ ఉన్నవారికి తన వల్ల వైరస్ సోకకూడదుకదా అంటూ పలు విషయాలను వెల్లడించారు.
14 Total Views, 2 Views Today