November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వికెట్ కీపర్ అంటే ధోని…

1 min read

AABNEWS : మహేంద్రసింగ్ ధోనీని మొదటిసారిగా చూసినప్పుడు అతడి గురించి తనలో కలిగిన భావాలను టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ తాజాగా పంచుకున్నారు. ధోనీ కంటే ఒక సంవత్సరం ముందు క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టిన గంభీర్ భారత్ ఏ అసైన్మెంట్లలో భాగంగా తామిద్దరమూ వేరు వేరు టూర్లలో పాల్గొన్నామని చెప్పారు. అక్కడే తమ ఇద్దరి మధ్యా బందం ఏర్పడిందని తమ ఆట ద్వారా ఒకరికొకరం అర్థం చేసుకున్నామన్నారు. 2004 ప్రారంభంలో ధోనీ రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ బాది ప్లేయర్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికయ్యాడు. కెన్యా, పాకిస్తాన్ ఏ టీములతో జరిగిన త్రిముఖ టోర్నీలో భారత్ ఎ జట్టును గెలిపించాడని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. భారత్ ఏ జట్టు టూర్ లో భాగంగా కెన్యా, జింబాబ్వేలకు వెళ్లాము. పాకిస్తాన్, కెన్యాలతో త్రిముఖ టోర్నీలో ఆడాం. బంతిని ధోనీ బలంగా బాదిన తీరు చూసి వికెట్‌ను కాపాడుకుంటూనే బంతిని బలంగా బాదే ప్రత్యేకత అతడిలో ఉందని మేం భావించాం అని గంభీర్ చెప్పాడు. స్టార్ స్పోర్ట్‌లో క్రికెట్ కనెక్టెడ్ షోలో పాలుపంచుకున్న గంభీర్ వికెట్ కీపర్‌గా ధోనీ ప్రారంభంలోనే సాదించిన గుర్తింపును పంచుకున్నాడు2004లో బంగ్లాదేశ్తో వన్డే అడటం ద్వారా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలెట్టాడు. బ్యాట్‌తో మెరుపులు సృష్టించడంతో బారత వికెట్ కీపర్‌గా ఉన్న ధోనీని జాతీయ టీమ్‌కు కెప్టెన్ చేశారు. అనతికాలంలోనే భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించాడు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను సాధించిన ధోనీ చరిత్రలో మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్‌లలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. 2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు.ఇక గంభీర్ వంతుకు వస్తే రెండు ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు సాధించాడు. భారత్ టెస్టు ర్యాంకింగ్‌లలో ముందుపీటికి రావడానికి తనవంతు పాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్ పైనల్‌లో గంభీర్, ధోనీ మధ్య మర్చిపోలేని భాగస్వామ్యం నెలకొంది. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయతీరానికి చేర్చారు. ఈ మ్యాచ్‌లోనే సిక్సలు బాదడంలో మహేంద్రసింగ్ ధోనీ సమర్థత గొప్పగా రుజువయిందని గంభీర్ పేర్కొన్నాడు. ఒక గొప్ప విజయగాధకు అదే నాంది పలికిందని చెప్పాడు.ధోనీకి ముందు మనం అనేకమంది అధ్భుతమైన వికెట్ కీపర్లను చూసి ఉంటాం. కానీ వంద మీటర్ల దూరం దాటే సిక్సులను బాదే హార్డ్ హిట్టింగ్ ప్లేయర్లను మనం ఎన్నడూ చూడలేదు. అందుకే ధోనీ అసాధారణమైన బ్యాట్స్‌మన్. అతడు సాధించిన గొప్ప విజయాలకు అదే కారణం అని గంభీర్ కొనియాడారు.

 183 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.