AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వీడ్కోలు పలకాల్సిందే…

1 min read

AABNEWS :  అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌ కోహ్లీపై టీమ్‌ఇండియా అతిగా ఆధారపడకూడదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనెసర్‌ అన్నాడు. ఏదో ఒకరోజు అతడికి వీడ్కోలు పలకక తప్పదని గుర్తు చేశాడు. భవిష్యత్తు తారలను పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. మనమిప్పుడు భవిష్యత్తును చూడాలి. భారత క్రికెట్‌ భవితవ్యం ఏంటి? అందుకు ఇదే సరైన సమయం. ఏదో ఒకరోజు విరాట్‌ వీడ్కోలు పలకక తప్పదు. అందుకే ప్రతిసారీ టీమ్‌ఇండియా అతడిపైనే ఆధారపడకూడదు. ఇతరులు బాధ్యత తీసుకోవాలి. విరాట్‌ లేకుండా భారత క్రికెట్‌ పరిస్థితి ఏంటో చూడాలి. ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో ఈ సంగతి తెలుస్తుంది. కోహ్లీ, అజింక్య, రోహిత్‌ వీడ్కోలు పలికాక ఎవరు స్టార్లు అవుతారో చూడాలి. శుభ్‌మన్‌కు ఇదో గొప్ప అవకాశం’ అని పనెసర్‌ అన్నాడు.

 494 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.