AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సిడ్నీ టెస్టులో భరత్ ఉత్కంఠ…

1 min read

AABNEWS : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో ఆధిపత్యం చెలాయించగా రెండో సెషన్‌లో విఫలమైంది. కీలక సమయంలో రిషభ్‌పంత్‌(97; 118 బంతుల్లో 12×4, 3×6), పుజారా(77; 205 బంతుల్లో 12×4) ఔటవ్వడంతో ఫలితంపై ఆసక్తి పెరిగింది. భోజన విరామం తర్వాత దూకుడు పెంచిన పంత్‌ లైయన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కమిన్స్‌ చేతికి చిక్కాడు. దీంతో అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 250/4గా నమోదైంది. విహారి(4; 52 బంతుల్లో) క్రీజులోకి రావడంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. అతడు పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే కమిన్స్‌ వేసిన 83వ ఓవర్‌లో పుజారా హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. కాసేపటికే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అతడు ఔటవ్వడంతో భారత్‌ 272 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆపై క్రీజులోకి వచ్చిన అశ్విన్‌(7; 25 బంతుల్లో 1×4)తో కలిసి విహారి బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో రెండో సెషన్‌లో టీమ్‌ఇండియా 96 ఓవర్లకు 280/5తో నిలిచింది. చివరి సెషన్‌లో భారత్‌ విజయానికి 127 పరుగులు కావాలి.

 950 Total Views,  14 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.