September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కదులుతున్న రైల్లోంచి…

1 min read

AABNEWS : మహారాష్ట్రలోని నవీ ముంబయిలో 25 ఏళ్ల యువతిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి.. కదులుతున్న రైల్లోంచి ఆమెను కిందికి తోసేసి హత్య చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఆ యువతి వశీ బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై అపస్మారక స్థితిలో కనిపించడంతో నగరం ఉలిక్కిపడింది. పోలీసుల కథనం ప్రకారం.. టిట్వాలాలో నివాసముంటున్న ఓ యువతి.. పొవైలో ఇంటిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన తలిదండ్రులను చూడటానికి వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి వస్తుంటుంది. ఎప్పటిలాగే గత శనివారం కూడా ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి పొవైకి బయలుదేరింది. అప్పటి నుంచి ఆమె తన ఇంట్లో ఎవరికీ అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని వశీ రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలపై రైల్వే సిబ్బంది ఒకరు చూశారు. వెంటనే ఆ వ్యక్తి రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు, పోలీసులకు తెలియజేశారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని. ఆ యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జేజే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా.. మాట్లాడే స్థితిలో లేదు.

 1,769 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.