పెట్రోలింగ్…
1 min read
AAB NEWS : పెట్రోలింగ్ అనగానేమి మనం వాడుక భాషలో పెట్రోలింగ్ అనే మాట వింటుంటాం సాధారణంగా పెట్రోలింగ్ అనే విషయాన్ని పోలీసులు ఉపయోగిస్తూ ఉంటారు. పెట్రోలింగ్ అనగా ప్రజల యొక్క ఆస్తి పాస్తులు కాపాడుతూ , ప్రజలకు సంఘ విద్రోహ చర్యల ద్వారా భంగం కలగకుండా చూడడమే పెట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
పగటి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండడం రాత్రివేళల్లో దొంగతనాలు ఇతర నేరాలు జరగకుండా అరికట్టడం అనేది పెట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్రోలింగ్ గుంపులు ఎక్కువ ఉన్న ఏరియాల్లో మార్కెట్ చౌరస్తాలో మార్కెట్ ప్రాంతంలో జగడాలు కొట్లాటలు జరిగే ప్రాంతాల్లో పాత నేరస్థులు ఉన్న ప్రాంతాల్లో vip లు ఉన్న ఏరియాల్లో ఎక్కువగా పెట్రోలింగ్ చేస్తారు..
నేరం గురించి సమాచారం తెలిసిన వెంటనే ఫిర్యాదు తీసుకొనుట లేనిచో ఫిర్యాదుని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు పంపి తాను నేరస్తులను స్థలమునకు పోయి తగు జాగ్రత్తలు తీసుకుంటారురహదారిలో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ వాహనాలు ఆగకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు తగు చర్య తీసుకోవడం ఊరి చివర ప్రాంతాల్లో సంఘవిద్రోహ పనులు జరగకుండా ఉండడం. అగ్ని ప్రమాదాలను అరికట్టడం ప్రమాద స్థితిలో ఉన్న కట్టడాలు చారిత్రక కట్టడాలు కాపాడటం. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం , ముసలివారు గుడ్డివారు రహదారి వేశ్య గృహములు ,పాత నెరస్థులపైన నిఘా ఉంచుతూ దొంగలు చెడు నడత దొంగ సొమ్ము కొనే వారిపై నిఘా ఉంచుతూ తనకు అప్పగించబడిన నిందితుల పై నిఘా ఉంచి చేయడం అనేది పెట్రోలింగ్ లో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి ముఖ్యమైన పని
496 Total Views, 2 Views Today