AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఫొటో మార్ఫింగ్​ చేసి మహిళ జీవితంతో అట…

1 min read

AABNEWS : మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి తన భార్యే అని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అప్పటి నుంచి ఆ మహిళ చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తోంది. కుటుంబంలోని కొందరు ఆమెను మాటలు అంటూనే ఉన్నారు. భర్త తరఫు బంధువులు అనుమానంగా ప్రశ్నిస్తున్నారు. 2018 నవంబర్ వరకు రేష్మ జీవితం సాఫీగా సాగింది. అయితే ఓ రోజు సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన తన ఫొటోను చూసింది. వేరే వ్యక్తి ఎవరో తనను భార్య అని చెప్పడంతో ఒక్కసారిగా షాకైంది. ఇది కుటుంబ సభ్యులకు తెలియడంతో అమాయకురాలైన ఆమె అనుమానానికి గురైంది. రెండేండ్లుగా ఈ విషయంపై ఆమె పోరాడుతోంది.చివరికి ఆమె ఫిర్యాదు చేయగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు రవి కుమార్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని మెట్రో పాలిటన్​ మేజిస్ట్రేట్​ ఆశిష్ కుమార్ మీనా ఆదేశించారు. ఫొట్​షాప్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఫేస్​బుక్​ అప్​లోడ్​ చేసి బాధిస్తున్నాడని మహిళ చెప్పింది. ఆ మహిళ తరఫున న్యాయవాది కృష్ణ కుమార్ శర్మ కోర్టులో వాదించారు. నిందితుడు ఆరు ఫేస్​బుక్ అకౌంట్లను వివిధ పేర్లతో వాడుతూ ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడని, మహిళ పరువుకు భంగం కలిస్తున్నాడని అన్నారు. ఫొటోలు తొలగించాలని నిందితుడిని ఆ మహిళ సంప్రదించిందని, అయితే తనకు డబ్బు, వ్యక్తిగత ఫేవర్ చేయాలని అడుగుతున్నాడని తెలిపారు. బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడని వెల్లడించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయ స్థానం విచారణకు ఆదేశించింది. చట్టం ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా అధికారులు ఈ విషయంలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. కొందరు సైబర్ నేరగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే కొందరు బాధితులు సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా.. మరికొందరు మౌనంగా భరిస్తుండడంతో అనేక ఘటనలు వెలుగులోకి రావడం లేదు.

 56 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.