సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు…
1 min read
AAB NEWS : ఖమ్మం : నేరాల అదుపులో తెలంగాణ పోలీస్ విప్లవాత్మకమైన ముందడుగు వేసిందని ఐజీ నాగిరెడ్డి చెప్పారు. సైబర్ నేరగాళ్లకు మూకుతాడువేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఖమ్మం నగరంలోని కమాండ్ కంట్రోల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన రెండ్రోజులపాటు జిల్లాలోనే ఉన్నారు. ఈ క్రమంలో పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేసి, అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాలను టెక్నాలజీ సాయంతో గుర్తించాలని అన్నారు. ప్రధానంగా ప్రొయాక్టివ్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. పోలీస్‌శాఖలో సాంకేతికంగా గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. ఇప్పటికే సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ క్రైమ్ ల్యాబ్‌ల బలోపేతానికి ప్రభుత్వ సహకారంతో అన్నిరకాల చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్భాల్, ఏడీసీపీ లా అండ్ ఆర్డర్ మురళీధర్, ఏసీపీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
22 Total Views, 2 Views Today