AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అత్త ఇంటికి కన్నం వేసిన కోడలు…

1 min read

AAB NEWS : ఇటీవల కాలంలో నగరంలో దొంగతనాలు పెరిగిపోయాయి. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసుకొని కొల్లగొడుతున్నారు. కరోనా లాక్ డౌన్ తరువాత ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. కొంతమంది డబ్బు కోసం సొంత ఇంటికే కన్నం వేస్తున్నారు. యాప్రాల్ లో నివసించే ఓ మహిళ ఈనెల 23వ తేదీన పెళ్ళికి వెళ్ళింది. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇల్లు దోపికిది గురైంది. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఆ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చోరీ చేసింది ఇంటి దొంగలే అని గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో పరిశోధన చేసి దొంగలను పట్టుకున్నారు. ఆ ఇంటి కోడలు తన తల్లి సహాయంతో సొంత ఇంట్లోనే చోరీ చేసింది. తన తల్లి ప్రోద్బలంతోనే అలా చేసినట్టు కోడలు పోలీసులకు తెలియజేసింది.

 90 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.