AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆకాశంలో అద్భుతం…

1 min read

AABNEWS : సుమారు 400 ఏళ్ల తర్వాత ఆకాశంలో ఓ అద్భుతం కనువిందు చేయనుంది. మన సౌర కుటుంబంలోని గురు, శని గ్రహాలు అత్యంత సమీపంగా వచ్చి ఒక్కటిగా కనిపించే అద్భుత దృశ్యం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రేట్ కంజక్షన్‌గా సైంటిస్టులు పిలుస్తున్న ఈ అద్భుతం చివరిసారి 1623లో జరిగింది. మళ్లీ 2080లోనే ఇది కనిపిస్తుంది. సోమవారం సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఈ అద్భుతాన్ని చూడవచ్చు. అయితే ఈ సంయోగం స్పష్టంగా కనిపించాలంటే బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ ఉండాలి. ఇలా చూస్తే గురు గ్రహం చుట్టూ తిరిగే నాలుగు చందమామలు కూడా కనిపిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులకు చూపించడానికి దేశంలోని అన్ని ప్లానెటోరియాలు సిద్ధంగా ఉన్నాయి. చివరిసారి 1623, జులై 16న ఈ రెండు గ్రహాలు అతి సమీపంగా వచ్చాయి.

 276 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.