AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈ రాష్ట్రాల్లో కుమ్మేయనున్న వర్షాలు…

1 min read

AAB NEWS :

చెన్నై: నివర్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కోస్తాంధ్రలో వచ్చే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 200కుపైగా బోట్లను కోస్ట్ గార్డ్ సాయంతో తీరానికి సురక్షితంగా చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తం 218 బోట్లలో 8 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్టు తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి జయకుమార్ చెప్పారు. అలాగే, తమ బోట్లను ఫిషింగ్ హార్బర్లకు అనుమతించాల్సిందిగా కేరళ, కర్ణాటక, లక్షదీప్, గోవా ప్రభుత్వాలను కోరారు.

వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ, కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురవనుండగా, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షణ కర్ణాటక లోపల, లక్షదీప్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షదీప్, దక్షణ కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమలలో మంగళ, బుధవారాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

 48 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.