ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జీవిత చరిత్ర…
1 min read
AABNEWS : ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. ఇతడు జనవరి 20, 1940న జన్మించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోక్సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు.
నట వారసుడు : ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు.కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రీయ రాజుల వంశస్తూలు విజయనగర సామ్రాజ్యము వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవితబాగస్వామి శ్యామలా దేవి వీరికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు
రాజకీయ ప్రస్థానం:
కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరినాడు. అదే ఏడాది నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీచేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యాడు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుతంలో మంత్రిపదవిని నిర్వహించాడు. 2004 లోక్సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పొందినాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టిని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు.
ఇపుడు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు.
85 Total Views, 2 Views Today