September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎల్లుండి మధ్యాహ్నం రావాలని కోరిన కేంద్రం…

1 min read

AABNEWS : రైతు ఆందోళనలు ఈరోజు 33వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో సారి రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చర్చలకు రైతు సంఘాల ప్రతినిధులు హాజరు కావాలని సోమవారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది. నిజానికి రేపే ఈ చర్చలు జరగాల్సి ఉంది. కానీ కేంద్రం ఎల్లుండి కలవాలని రైతు సంఘాలను కోరింది. రైతుల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులతో చర్చలు జరిపే ముందు వారితో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. గతంలో రైతులు, కేంద్రం మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాల్లో తమకు మార్పులు అవసరం లేదని.. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 740 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.