కొవిడ్:సీరం ఇన్స్టిట్యూట్కి ప్రధాని మోదీ?
1 min read
AAB NEWS: పుణే: కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియపై అవగాహన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారాంతంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ సంస్థలను సందర్శించనున్నట్టు సమాచారం. దీనికోసం ప్రధాని మోదీ ఈ వారాంతంలో పుణేలో పర్యటించే అవకాశం ఉందని పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు మీడియాకు వెల్లడించారు. ”పీఎంవో నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి అధికారిక సమావేశం అందలేదు. అయితే ఆయన వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో మేము ముందస్తు ఏర్పాటు చేపట్టాం…” అని ఆయన తెలిపారు. ప్రధాని పర్యటనలో దాదాపు 100 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొనే అవకాశం ఉందని రావు పేర్కొన్నారు. ఈ నెల 27నే ఈ పర్యటన జరగాల్సి ఉన్నప్పటికీ… వచ్చేనెల 4కి షెడ్యూల్ మార్పుచేసినట్టు ఆయన వివరించారు. కొవిడ్-19 వ్యాక్సీన్ తయారీకోసం ముందస్తు క్లినికల్ టెస్టులు, పరిశీలన, విశ్లేషణ కోసం కేంద్ర డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మొత్తం ఏడు సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్, జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ కూడా ఉన్నాయి.
20 Total Views, 2 Views Today