AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దీదీకి గాయం.. మడమ ఎముకలో పగుళ్లు

1 min read

AABNEWS : 48 గంటలపాటు పర్యవేక్షణ అవసరమన్న వైద్యులు
కోల్‌కతా: కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం ఉదయం నివేదిక విడుదల చేశారు. ఆమె ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయాలను గుర్తించినట్లు వెల్లడించారు. దీదీ కుడి భజం, మెడకు కూడా గాయమైనట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నుంచి సీఎం.. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆమెను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. మరిన్ని వైద్యపరీక్షలు చేయాల్సి ఉందన్నారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న దీదీని బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తోసేసిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి తిరిగి కారు ఎక్కుతుండగా.. కొంతమంది తనను బలవంతంగా తోసి, కారు తలుపు వేసినట్లు మమత పేర్కొన్నారు. నొప్పితో విలవిల్లాడుతున్న సీఎంను వెంటనే కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కాలి మడమలో పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు..

 255 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.