AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేశం కోసం బుల్లెట్ గాయాలు…

1 min read

AAB NEWS : న్యూఢిల్లీ: దేశం కోసం బుల్లెట్ దెబ్బలు తిన్నామని, తమను ఖలిస్థానీ అని మాత్రం అనొద్దని పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల రైతు గురుసేవక్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్‌లోని ముక్తసర్‌కు చెందిన గురుసేవక్ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని క్యాంపులో ఉన్న ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఆందోళన నుంచి వెనక్కి వెళ్లబోనని తేల్చిచెప్పాడు.

”12 ఎకరాలున్న నేనే వ్యవసాయంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాను. అలాంటిది చిన్న రైతుల పరిస్థితి ఏమిటి? వారి వద్ద కనీస వనరులు కూడా ఉండవు. అలాంటి ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా కోల్పోతే వారి పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించాడు.

కేంద్రం తమ డిమాండ్లను వినిపించుకోవడం లేదని గురుసేవక్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమను ఉగ్రవాదులుగా, ఖలిస్థానీలుగా ముద్రవేస్తూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డాడు. ”మా పెద్దన్నయ్య ఆర్మీలో ఉన్నాడు. 1999 కార్గిల్ యుద్ధంలో పోరాడాడు. దేశం కోసం అతడు బుల్లెట్ దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు నేను రోడ్డుమీద ఆందోళన చేస్తున్నా. నన్ను మీరు ఖలిస్థానీ అని ఎలా పిలుస్తారు?” అని ప్రశ్నించాడు. మా ఉద్యమం వ్యవసాయం, భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసమేనని పేర్కొన్నాడు. ఈ ఆవేదన గురుసేవక్ సింగ్ ఒక్కడిదే కాదు.. ఆందోళన చేస్తున్న వేలాది మంది రైతులది కూడా.

మాన్సా జిల్లాకు చెందిన 60 ఏళ్ల బల్జీత్ కౌర్ మాట్లాడుతూ..” మా గ్రామం నుంచి మొత్తం ఆరుగురు మహిళలం వచ్చాం. ఓ ట్రాలీలో క్యాంపు వేసుకున్నాం. నాలాంటి వృద్ధురాలికి ట్రాలీ ఎక్కడం, దిగడం ఎంత కష్టమో తెలియంది కాదు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. ఇక్కడ టాయిలెట్లు కూడా సమస్యే. అయినప్పటికీ వ్యవసాయాన్ని బతికించుకునేందుకు చివరి ఆశగా ఇక్కడికొచ్చాం” అని పేర్కొన్నారు.

 22 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.