నా పార్టీ బానిసగా ఉండదు…
1 min read
AAB NEWS : పొత్తు పెట్టుకోవడమా…? సమస్యే లేదు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక ప్రకటన చేసారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశం గురించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. నా పార్టీ కూటమికి బానిసగా ఉండే సమస్యే లేదని ఆయన అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయంపై మాట్లాడతా అన్నారు.
రాజకీయ నాయకుడిగా మారిన కమల్ వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు ఎన్నికల గురించి మాట్లాడుతూ… నా పార్టీ ప్రజలతో మాత్రమే కూటమి ఏర్పాటు చేస్తుంది అన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందే, కమల్ హాసన్ ఒక కూటమి కోసం కాంగ్రెస్ ను సంప్రదించారు. అయితే ఆయన డీఎంకేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డిఎంకె కాంగ్రెస్ తో పొత్తులో ఉండటంతో ఆయన వెనక్కు తగ్గారు.
24 Total Views, 4 Views Today