AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాదచారిపై కత్తితో దాడిచేసిన దుండగుడు…

1 min read

AAB NEWS : ముంబై: ముంబైలో ఓ పాదచారిపై దుండగుడు కత్తితో దాడిచేశాడు. అయితే అప్రమత్తమైన అతడు ఉన్మాది నుంచి తప్పించుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన గతనెల 28న జరిగింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఉన్న పాదచారుల వంతెనపై నుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుకనుంచి ముసుగుతో వచ్చిన ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడిచేశాడు. మరోమారు పొడవడానికి ప్రయత్నించేలోపు అతడు అప్రమత్తమై తప్పించుకున్నాడు. మళ్లీ దాడిచేయడానికి ప్రయత్నించినప్పటికీ బాధితుడు ప్రతిఘటించడంతో దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఫుటోవర్‌ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నది.

కాగా, దాడికి పాల్పడిన వ్యక్తి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించినట్లు లేదని పోలీసులు అన్నారు. ఇది ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనని, అతడిని గాయపరచడానికో లేదా చంపడానికో ప్రత్నించినట్లు ఉందని అనుమానం వ్యక్తంచేశారు.

 46 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.