భద్రత పెంచండి…
1 min read
AAB NEWS : న్యూఢిల్లీ: రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు భద్రత పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడా శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా చూసుకోవాలని సూచించింది. బంద్ నేపథ్యంలోనూ కొవిడ్-19 నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు చెప్పినట్లు హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. మంగళవారం రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు మద్దతునిచ్చాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ ఉంటుందని రైతు సంఘాలు చెప్పాయి.
22 Total Views, 2 Views Today