AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారత్ బంద్ పై కంగనా కామెంట్స్ …

1 min read

AAB NEWS : ముంబై :బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భారత్ బంద్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్ ద్వారా హాట్ కామెంట్స్ ట్వీట్ చేశారు. రైతు సమస్యలతో దేశం ఇప్పటికే అట్టుడికి పోతోందని, ఇప్పుడు భారత్ బంద్ తో దేశం మరిన్ని సమస్యలు ఎదుర్కొనబోతుందని, భారత్ బంద్ చేయడం సరికాదని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ఈ పడవను తాకిన తుఫానులు, కానీ పడవలో కొన్ని రంధ్రాలు చేయడానికి గొడ్డలిని తీసుకురండి, ప్రతి ఆశ ప్రతిరోజూ ఇక్కడ చనిపోతుంది “అని ఆమె ట్వీట్ చేసింది. బంద్ ను, బంద్ కు మద్దతు పలికిన వారిని ఉద్దేశిస్తూ చేసిన కంగనా ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతున్నది. దేశం ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని కంగనా ట్విట్టర్ ద్వారా పేర్కొనడంతో నెటిజన్లు, వివిధ పార్టీల నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

 72 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.