AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భార్య వీడియో తీసిన భర్త…

1 min read

AAB NEWS : అత్త ఇంటి వారు వేధింపులకు గురి చేస్తుంటే, వారు పెట్టే ఆరళ్లు తట్టుకోలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. తన అత్తింట్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో భర్త ఉండగానే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. అయితే, ఇక్కడ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే తన భార్య ఒంటికి నిప్పంటించుకుని మంటల ధాటికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే, ఆమె భర్త వేడుక చూశాడు. కాపాడాల్సిన వాడు కనీసం స్పందించలేదు. అంతే కాదు. ఆ ఘటనను వీడియో తీశాడు. దాన్ని ఆమె కుటుంబసభ్యులకు పంపాడు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఈ ఘటన జరిగింది. అత్తింట్లో వేధింపులు, భర్త పెట్టే హింసలకు తాళలేక ఆ మహిళ నవంబర్ 20న ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, ఇరుగుపొరుగు వారు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. భారీగా కాలిన గాయాలు కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భార్యను కాపాడాల్సిన భర్త ఇలా వీడియో తీసి దాన్ని ఆమె కుటుంబసభ్యులకు పంపడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 42 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.