మళ్ళీ రెడ్ అలెర్ట్..!
1 min read
AAB NEWS : కశ్మీర్లో ఉగ్రదాడి.. మళ్ళీ రెడ్ అలెర్ట్..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. శ్రీనగర్ హెఎమ్టీ ప్రాంతంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి.. ఈనెల 28న కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అలజడి రేపడమే లక్ష్యంగా ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముష్కరుల కోసం గాలిస్తున్నారు.
16 Total Views, 2 Views Today