AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాత్రి కర్ఫ్యూ…

1 min read

AAB NEWS : బెంగళూరు : కర్ణాటకలో రెండో దశ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన మధ్య కర్ణాటకలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్‌ సుదర్శన్‌ ఈ మేరకు ముఖ్యమంత్రి యడ్యూరప్పకు నివేదికను సమర్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని నివేదికలో హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు అవకాశం కల్పించవద్దని సూచించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు రిసార్ట్స్, హోటళ్ళు, రోడ్లపై (ఎంజీ రోడ్, బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్) తదితర ప్రాంతాల్లో బహిరంగ నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలని కోరారు. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించారు. అలాగే కొవిడ్‌-19 మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 240 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.