రాష్ట్రానికి మరో కొత్త ప్రమాదం కాకుల ద్వారా సోకె అవకాశం…
1 min read
AABNEWS : రాష్ట్రానికి మరో కొత్త ప్రమాదం కాకుల ద్వారా సోకె అవకాశం: ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు కొరోనా, స్ట్రెయిన్ వంటి కంటికి కనిపించని వైరస్ లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే చనిపోయిన కాకుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతున్నట్లు ప్రచారం మొదలైంది రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల లో కాకులు ఎక్కువగా చనిపోవడం తో అక్కడి పరిశోధన సంస్థలు చనిపోయిన కాకులను పరిశీలించగా వాటికీ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి చనిపోయిన కాకుల ద్వారా మనుషులకు కూడా సోకె అవకాశం ఉందని వైద్యులు అనుమానిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం హై అలెర్ట్ జారీచేసింది అలాగే అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేయడం జరిగింది. కాకులు ఎక్కువ గా చనిపోయిన ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
135 Total Views, 2 Views Today