రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా…
1 min read
AAB NEWS : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు బలపడి రూ. 81.89కు చేరింది. డీజిల్ ధర లీటర్కు 24 పైసలు పెరగడంతో రూ. 71.86కు చేరుకుంది. 48 రోజుల తర్వాత ఈ నెల 20న నుండి దేశీయంగా పెట్రోల్ ధరలు పెరగడం మొదలైంది. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నవంబర్ 24వ తేదీ వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. గత ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు 83 పైసలు పెరిగింది. డీజిల్ ధర అధికంగా లీటర్ రూ. 1.40 పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45 డాలర్లను అధిగమించింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48 డాలర్లకు చేరింది. దీంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి.
20 Total Views, 2 Views Today