September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులను ఉద్దేశించి మోదీ ప్రసంగం…

1 min read

AABNEWS : మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథక నిధులు రూ. 18వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లాభాల గురించి మాట్లాడతారని ఆ ప్రకటనలో వెల్లడించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశం జరిగిన తర్వాత నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నామన్నారు . ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాసిన లేఖను రైతులంతా చదవాలని ప్రధాని కోరారు.

 240 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.