AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులపై పోలీసుల చర్యను ఖండించిన పంజాబ్‌ సీఎం…

1 min read

AAB NEWS : దిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళనను అడ్డుకునే క్రమంలో హరియాణా పోలీసులు వ్యవహరించిన తీరును పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే రైతుల హక్కులను ఈ విధంగా కాలరాయడం బాధాకరమన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

రెండు నెలలుగా పంజాబ్‌లో రైతులు ఎలాంటి సమస్యా లేకుండా శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు హరియాణా ప్రభుత్వం వారిని అడ్డుకుని రెచ్చగొడుతోంది? రైతులకు హైవేలపై వెళ్లే హక్కు కూడా లేదా? రాజ్యాంగదినోత్సవం రోజునే రైతుల హక్కులను అణచివేయడం బాధాకరమైన ఘటన. ఖట్టర్‌జీ వారిని వెనక్కి నెట్టకండి. రైతులను ముందుకు వెళ్లనివ్వండి. వారి గళాన్ని శాంతియుతంగా దిల్లీకి తీసుకెళ్లనివ్వండి’ అని అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే చేతులను పట్టుకోవాలే గానీ పక్కకు నెట్టేయొద్దని పంజాబ్‌ సీఎం కేంద్రాన్ని కోరారు.

 20 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.