AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వారం రోజులు అన్నీ బంద్…

1 min read

AABNEWS : ప్రపంచదేశాలను కరోనావైరస్ కలవరపెడుతూనే ఉంది… ఇక, యూకేలో కొత్త తరహా కరోనా వైరస్‌ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకుతోంది… మరోవైపు.. కరోనావైరస్ విస్తరిస్తుండడంతో.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ భూటాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 7 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. రాజధాని థింఫూతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో… కోవిడ్ వ్యాప్తి పెరగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయనీ.. స్కూళ్లు, సంస్థలు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు మూసివేస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా, కరోనా వైరస్‌ విజృంభనతో గతంలోనూ ఈ తరహా లాక్‌డౌన్‌ను విధించింది భూటాన్ ప్రభుత్వం.. కేసులు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరగడంతో.. మరోసారి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

 126 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.