వెంకయ్య నాయుడు సందేశం…
1 min read
AABNEWS : ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం మనమంతా ఎదురు చూస్తున్న సందర్భం. ఇది మన స్ఫూర్తిని బలోపేతం చేస్తూ, నూతన ఆశలు, ఆకాంక్షలతో భవిష్యత్ దిశగా సాగే మార్గం. అత్మ విశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంటే, కొంత పయనం ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుంది. గతేడాది కరోనా మహమ్మారి మనకు అనేక జీవన పాఠాలు నేర్పించింది. ప్రతికూలతలను అవకాశాలుగా మలచుకునే దిశగా మనల్ని సిద్ధం చేసింది. దానికి వీడ్కోలు పలుకుతూ, సరికొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం.గతేడాదితో పోలిస్తే 2021లో మరింత ఆరోగ్యకరమైన, సంతోషకమైన మరియు ఉన్నతమైన ప్రపంచంవైపు సాగే దిశగా ప్రేరణ పొందుదాం. ధైర్యం, విశ్వాసం, సంఘీభావం, నైపుణ్యాలతో భవిష్యత్ సవాళ్ళను అధిగమించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో కరోనా మహమ్మారితో పోరాడేందుకు, దాన్ని ఓడించేందుకు ఓ ఉన్నతమైన నిబద్ధతతో ప్రవేశిద్దాం. టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున 2021ని నూతన ఉత్సాహం, సానుకూలతలతో స్వాగతిద్దాం.
162 Total Views, 2 Views Today