వ్యాక్సిన్ సన్నద్ధతపై రాజీవ్‌గౌబా సమీక్ష…
1 min read
AABNEWS : ఢిల్లీ : కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రజారోగ్య వ్యవస్థ, వ్యాక్సిన్ సన్నద్ధతపై అన్ని రాష్ర్టాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో పర్యవేక్షణ, కంటైన్మెంట్కు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.5 లక్షలలోపేనని, మరణాల రేటూ తగ్గుతోందన్నారు. పటిష్టమైన కంటైన్మెంట్, సరిపడా పరీక్షలతో కొవిడ్ వ్యాప్తిని తగ్గించాలన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని అంశాలను సీఎస్‌లు సమీక్షించాలన్నారు. డిసెంబర్ 6లోపు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, జిల్లా, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సమావేశాలు పూర్తిచేయాలన్నారు. వ్యాక్సిన్ సరఫరాకు కోల్డ్ చైన్, రవాణా వసతులు కల్పించాలన్నారు. ప్రాధాన్య వర్గాలకు మొదట వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ప్రజల్లో సానుకూల చర్చ జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
22 Total Views, 2 Views Today