10% మంది పాఠశాల నుండి బయట ఉన్నారు…
1 min read
AABNEWS : డిల్లి పిల్లలలో దాదాపు 10% మంది పాఠశాల నుండి బయట ఉన్నారు: 1.02 కోట్ల జనాభాను కలిగి ఉన్న డిల్లి లోని వివిధ సామాజిక-ఆర్థిక సూచికలను అర్థం చేసుకోవడానికి నవంబర్ 2018 మరియు 2019 నవంబర్ మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ గణాంకాలు సేకరించడమైనది. డిల్లి ప్రభుత్వ సర్వే ప్రకారం 6-17 సంవత్సరాల వయస్సులో 2,21,694 మంది పిల్లలు (లేదా మొత్తం 9.76%) పాఠశాల నుండి బయట ఉన్నారు. వారిలో 1,31,584 మంది వివిధ కారణాల వల్ల తప్పుకున్నారు మరో 90,110 మంది పిల్లలు ఎప్పుడూ పాఠశాలకు హాజరు కాలేదు.
ఈ ఆందోళన కలిగించే గణాంకాలు, నవంబర్ 2018 మరియు 2019 నవంబర్ మధ్య ఒక సంవత్సర కాలంలో 1.02 కోట్ల మందిపై నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ సర్వే ఫలితంగా వేలుపడ్డాయి. మతం, కులం, ఆదాయం, విద్య, దీర్ఘకాలిక అనారోగ్యాలు, టీకా యొక్క స్థితి, ఉపాధి మరియు ఇష్టపడే రవాణా సాధనం మొదలగు వివరాలతో సహా నగరం యొక్క సామాజిక-ఆర్థిక కూర్పు వివరాలు వెలువరించడం జరిగినది, ఈ నివేదికను నవంబర్ 2020 లో ఫైనల్ చేశారు 6-17 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు పాఠశాలకు హాజరుకాకపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వనరులు లేకపోవడం. సర్వే ప్రకారం, వారు 29.2% ఉన్నారు. మరోవైపు, 13.50% మంది ఇంటిపనుల్లో నిమగ్నమై ఉన్నారు. 12.17% మంది తాము ఇప్పటికే “కావలసిన విద్యా స్థాయిని” సాధించామని అనగా మరియు వారిలో 9.37% మంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. డిల్లి జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 11.04% ఉండగా, వారిలో సగం కంటే తక్కువ మంది (55.40%) అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. 18 ఏళ్లు పైబడిన గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్న కేంద్రాలకు 47.15% మంది హాజరవుతున్నట్లు కనుగొనబడింది. డిల్లి లో 47.31% కుటుంబాలు నెలకు రూ .10,000 నుండి 25,000 వరకు ఖర్చు చేస్తున్నాయని, 42.5% కుటుంబాల నెలవారీ ఖర్చు 10,000 లేదా అంతకంటే తక్కువ అని సర్వే వెల్లడించింది.• మరోవైపు, 8.44% గృహాలు ప్రతి నెలా రూ .25,000-రూ .50 వేలు మరియు 1.66%. గృహాలు ప్రతి నెలా రూ .50,000 మరియు అంతకంటే ఎక్కువ ఆదాయంపై జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, డిల్లి వాసుల తలసరి ఆదాయం per capita income 2019-20లో రూ .3.89 లక్షలు (లేదా నెలకు రూ. 32,000 కన్నా ఎక్కువ) – ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. సర్వే చేసిన 20.05 లక్షల గృహాలలో 21% పైగా డెస్క్ టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నట్లు కనుగొనబడింది. వీరిలో 80.15% కుటుంబాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. డిల్లి నగర జనాభాలో ఆరోగ్యకరమైన 72.87% మంది ప్రభుత్వ ఆసుపత్రులను మరియు చికిత్స కోసం డిస్పెన్సరీలను సందర్శిస్తారని సర్వే గుర్తించింది. మిగిలిన జనాభా ప్రైవేట్ సౌకర్యాలపై ఆధారపడుతుంది. డిల్లి నగరం యొక్క మొత్తం జనాభాలో సుమారు 2.60% మంది ఏదో ఒక రకమైన దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనుగొనబడింది.ఆ సంఖ్యలో, 36.33% జనాభాకు డయాబెటిస్ (సెంట్రల్ జిల్లాలో 43.34%) ఉన్నట్లు గుర్తించబడింది, తరువాత 21.75% మందికి గుండె జబ్బులు (రక్తపోటు మరియు రక్త ప్రసరణ వ్యాధితో సహా) మరియు 9.17% మందికి శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. డిల్లి లో 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో నాల్గవ వంతు మంది ఎ రకమైన పిల్లలు టీకాలు తీసుకోలేదు. మొత్తంగా 0-5 వయస్సు బ్రాకెట్లోని 9.5 లక్షల మంది పిల్లలలో 2.13 లక్షలకు ఎటువంటి టీకా తీసుకోలేదు. డిల్లి లో 70.98% మందికి ఇంటి ప్రాంగణంలోనే నీరు అందుబాటులో ఉన్నట్లు కనుగొనబడింది. సౌత్ ఈస్ట్ జిల్లాలో 37.75% మందికి వారి ఇంటి ప్రాంగణంలోనే నీరు అందుబాటులో ఉంది షాహదారా జిల్లాలో 90% వారి ఇంటి ప్రాంగణంలోనే నీరు అందుబాటులో ఉంది. ఆగ్నేయ జిల్లాలోని 1.86 లక్షల గృహాలలో 43.28% గృహాలు బాటిల్ వాటర్‌పై ఆధారపడి ఉన్నాయి,. మొత్తం జనాభాలో మొత్తంగా వారి వాటా 7.76%. మొత్తం 1.01 లక్షల కుటుంబాలు నీటి ట్యాంకర్లపై ఆధారపడి ఉన్నాయి.
మరుగుదొడ్ల విషయానికొస్తే- 20.5 లక్షల గృహాలలో, 18.7 లక్షల గృహాలు మరుగుదొడ్లు కలిగి ఉన్నాయి. 1.22 లక్షల గృహాలు కమ్యూనిటీ మరుగుదొడ్లు, మరియు 11,497 గృహాలు బహిరంగ మలవిసర్జన విభాగంలోకి వస్తాయి
రూ .26.61 కోట్ల వ్యయంతో అమలు చేయబడిన, సర్వే నివేదిక ప్రకారం, మునుపటి నమూనా సర్వేలు మౌలిక సదుపాయాల లభ్యత మరియు సామాజిక భద్రత పరంగా అవసరాల యొక్క నిజ-సమయ/రియల్-టైం చిత్రాన్ని చిత్రీకరించలేకపోయాయి. డిల్లి లోని గృహస్థులు / వ్యక్తుల విషయంలో వివిధ సామాజిక-ఆర్థిక సూచికల బేస్‌లైన్ డేటా లేకపోవడం వల్ల, విధాన రూపకల్పన కోసం డిల్లి ఎన్సిటి ప్రభుత్వంలోని వివిధ విభాగాలు పథకాల అమలు రూపకల్పన విషయం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని డిల్లి ప్రభుత్వం భావించింది. మరియు ఈ నివేదికలో పొందుపరిచిన డేటా విధాన రూపకర్తలు, పరిశోధకులు మరియు ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని భావిస్తున్నారు జూలై 2018 లో తూర్పు డిల్లి లో ఆకలితో ఉన్న ముగ్గురు మైనర్ బాలికలు మరణించిన తరువాత వచ్చిన విమర్సల తరువాత 6,000 మంది క్షేత్రస్థాయి కార్మికుల పై సర్వే నిర్వహించడం జరిగింది. కుటుంబానికి రేషన్ కార్డు లేదని తేలింది, మరియు ప్రభుత్వ అధికారులు జరిపిన దర్యాప్తులో స్థానిక అంగన్వాడీ కేంద్రం మరణాల తరువాత రికార్డులను మోసం fudged చేసిందని తేలింది.
163 Total Views, 2 Views Today