అంగాన్వాడి సెంటర్ ద్వారా పిల్లలకు అందుబాటులో విద్యా కార్యక్రమాలు
1 min readసుల్తాన్ పూర్ గ్రామం, చౌటకుర్ మండలము, సంగారెడ్డి జిల్లా పరిధిలోని అంగన్వాడీ సెంటర్ లో కరోనా పిరియడ్ లో కూడా లబ్ధిదారుల అందరికీ నేరుగా ఇంటికే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. గత పదిహేను రోజుల నుండి చిన్న పిల్లలకు కు అనగా 0 – 6 సంవత్సరాల లోబడి ఉన్నవారికి గ్రోత్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ లో పిల్లల బరువు, ఎత్తు మరియు చుట్టుకొలత చూడడం జరుగుతుంది. సుల్తాన్పూర్ అంగన్వాడీ టీచర్ కవిత మాట్లాడుతూ ప్రీస్కూల్ విద్యార్థులకు ఇంటిదగ్గర సందర్శన ద్వారా విద్యా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంగన్వాడి రేషన్ క్రమం తప్పకుండా డా అందజేయడం జరుగుతుందని సర్పంచ్ మామయ్య గారు, ఎంపీటీసీ మాణిక్య రెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విధంగా తెలిపారు.

226 Total Views, 2 Views Today