అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్బంగా…
1 min read
AABNEWS : పర్యావరణ సమతుల్యం కోసం తెలంగాణకు హరిత హారం కార్యక్రమం క్రింద మొక్కలునాటి సంరక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్బంగా ఆదివారం రోజున కలెక్టరేట్ చౌరస్తాలో ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,పర్యావరణ సామతుల్యం,పచ్చదనం కోసం నర్సరీలలో మొక్కలను పెంచుతున్నామని, ఆరు విడతల్లో హరిత హారం కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగిందని, 7వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2021 నుండి 2030 వరకు ఐక్యరాజ్య సమితి పర్యావరణ పునరుద్ధరణ దశాబ్ద కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయని తెలిపారు. అటవీ,గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా మొక్కల పెంపకం,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా అటవీ అధికారి చంద్రశేఖర్, DSP వెంకటేశ్వర్లు, పోలీస్, అటవీ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

1,190 Total Views, 2 Views Today